Thursday, June 23, 2016

                                మా చార్ ధామ్ యాత్ర 

                                        మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు పుట్టినిల్లు..., పవిత్ర  హిమాలయాలు..!        ఎందరో యోగులు, మునులు, రుషులు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో సంచరిస్తారని చెబుతారు. అంతేకాదు హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. మనిషీ ఎంత అభివృద్ధి సాధించినా కూడా ప్రకృతికి నిబద్ధుడై ఉండాల్సిందే. పరమ సత్యాన్ని ప్రాచీన భారతీయ రుషులు ఎప్పుడో గ్రహించారు. అందుకే ప్రకృతికీ-మనిషీకి మధ్య బంధాన్ని వీడదీయలేనంతగా పెనవేశారు.         హిమవన్నగాల చెంత ఉన్న రాష్ర్టం ఉత్తరాఖండ్. రాష్ర్టంలోని నాలుగు దివ్యస్థలాన్ని చార్ ధామ్ గా వ్యవరిస్తారు.యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ క్షేత్రాల దర్శన సమాహారాన్ని చార్ధామ్ యాత్రగా పరిగణిస్తారు. ఇవి పూర్తిగా హిమలయాల్లోనే వెలిసిన పుణ్యధామాలు..! 

                                    చార్ధామ్ క్షేత్రాల యాత్రకు హరిద్వార్ను ముఖద్వారంగా భావిస్తారు. భగీరథ యత్నానికి  తలవంచి,  చండప్రచండమైన వేగంతో, గంగ శివుడి జటాఝూటంలోకి దూకింది. గంగ హిమ పర్వతాల నుంచి  జనావాసాల్లోకి వచ్చింది హరిద్వార్లోనే!   యాత్ర  లోనే  హరిద్వార్, రిషికేశ్ , డెహ్రాడూన్ , ముస్సోరి  లను కూడా చూ స్తాము. 


                                   మేము 12 మంది  కుటుంబ సభ్యులం కలసి చార్ధామ్ యాత్ర చేయుటకు  సంకల్పించుకొన్నాము. మా తమ్ముడు గున్నేశ్వర రావు 4 నెలల   ముందుగానే   AP Express ac  స్లీపర్ లో టికెట్లు బుక్ చేసాడు. అలాగే pawanhans వారితో నెల ముందు ఫటా నుండి కేదార్నాథ్ కు హెలికాఫ్టర్  టిక్కెట్లు కూడా బుక్ చేసాడు. మే నెల 28 5 మందిమి విజయవాడ లో బయలుదేరాము. మిగతా 7 మంది వరంగల్ లో అదే కోచి లో ఎక్కారు. ముందే అందరికి  కావలసిన మందులు, ఉలెన్ స్వేట్టర్లు, మంకీ కాప్స్, టార్చ్ లైట్ etc తెచ్చుకోమ్మని చెప్పాము. 29 సాయంత్రం 7 గంటలకు న్యూ ఢిల్లీ చేరాము. 16 నంబరు ప్లాటుఫారం న సామానుల  వద్ద కొంతమంది ఉండగా మిగిలిన వాళ్ళం  ac వెయిటింగ్ హల్ కు వెళ్లి  రిఫ్రెష్ అయి వచ్చాము. రాత్రి 11 గంటలకు డెహ్రాడూన్ ఎక్సప్రెస్  లో బయలు దేరి  30 తేదీ  ఉదయం 3 గంటలకు హరిద్వార్  చేరుకున్నాము.  రవి నికేతన్ లో 3 గదులు తీసుకొని సామానులు సద్దుకొని 7 గంటలకు దగ్గర లోని ఘాట్ లో గంగా స్నానం చేసాము.   రోజే హరి కి పౌరీ , రోపేవే లో మానసాదేవి  గుడి, శక్తీ గుడి చూసి సాయంత్రం గంగా హారతి చూసాము. 
haridwar కోసం చిత్ర ఫలితం
                             
ముందే బుక్ చేసుకున్న 12 సీట్ల  టెంపో ట్రావెలర్ లో  ఉదయం 7 గంటలకు గంగా స్నానం చేసిన తర్వాత బయలుదేరాము.  దారిలో డెహ్రాడూన్,ముస్సోరి చూసుకొని సాయంత్రం 6 గంటలకు బార్కోట్ చేరాము. ముస్సోరి లో kemptee  falls  వద్ద స్నానాలు చేసాము
kempty falls కోసం చిత్ర ఫలితం

మర్నాడు  ఉదయం 6 గంటలకు బయలుదేరి  హనుమాన్ చట్టి మీదుగా జానకిచట్టి చేరాము. ఇక్కడనుండి  యమునోత్రి కి నడిచిగాని,గుర్రాల మీద గాని, డోలి లో గాని  వెళ్లాల్సి ఉంటుంది. రాను పోను  గుర్రానికి రూ. 1200   డోలి కి 4000 ఛార్జి చేస్తారు. 
yamunotri trekking కోసం చిత్ర ఫలితం

యమునోత్రి 

                                                     యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది.    ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయం  జయపూర్ మహారాణి గులారియా వారిచే  19వశతాబ్ధంలో నిర్మించబడింది. యాత్రికులకు ఆలయ సమీపంలో వసతులు తక్కువ ఉన్నప్పటికి నదీమాతను దర్శించుకుని వెనుదిరుగుతుంటారు. స్నానానికి అనువుగా ఉష్ణగుండం ఉంటుంది. ప్రత్యేకంగా  స్నానాలకుగదులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ ప్రత్యేకతలలో ఒకటిగా యాత్రీకులు ఆలయం పక్కన ఉన్న చిన్న చిన్న ఉష్ణగుండంలో చిన్న బియ్యం మూటలను దారానికి కట్టి లోపల వదలి అన్నం తయారు చేసుకోవడం. పూజలకు సంబంధించి అన్ని వస్తువుల లభిస్తాయి. 

yamunotri కోసం చిత్ర ఫలితం
                                             యమునోత్రి చేరాడానికి హనుమాన్ చెట్టి, జానకి చెట్టి వరకు వాహనాలు వెళుతుంటాయి. కాలి నడకన చేరే వారికి అక్కడక్కడ మార్గాలలో ప్రభుత్వం తరుఫున కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటారు. 

yamunotri కోసం చిత్ర ఫలితం
 ఆలయం దగ్గరలో కొంతదూరం కాలినడకన చేరాలికాలినడకన వచ్చే వారికి ఏలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం కట్టదిట్టమైన బధ్రత చర్యలు తీసుకుంటుంది. డోలీ నడిపే  వారు తిరిగి యాత్రీకులను డోలీ వరకు తీసుకు వచ్చి బయలుదేరిన ప్రదేశానికి యాత్రీకులను చేరుస్తారు. అక్కడినుంచి తిరిగి హనుమాన్ చెట్టి వరకు వ్యానులలోనూ,జీపులలోనూ చేరాలి. ఇవి బాడుగకు సులువుగానే లభిస్తాయి.

                                                   
మేము రాత్రి బార్కోట్ లో విశ్రాంతి తీసుకొని, మర్నాడు  ఉదయమే దగ్గరిలో వున్న పోలీస్ ఠాణా లో  అందరము పిల్గ్రిమ్ రెజిస్ట్రేషన్ చేసుకుని  అక్నాలెడ్జి మెంట్స్ తీసుకొన్నాము. ఇది చాలా ముఖ్యమైన పని.   ఉత్తరకాసి మీదుగా గంగోత్రి కి వెళ్తూ దారిలో భట్వాడి లో ఆగాము . రాత్రి రెస్ట్ తీసుకొని మర్నాడు ఉదయమే గంగోత్రి చేరినాము.  భట్వాడి - గంగోత్రి  దారిలో  Gangnani  లో దిగి ఉష్ణగుండాలలో  స్నానము చేసాము. 
gangnani కోసం చిత్ర ఫలితం

నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. నాగేశ్వర రావు  ధైర్యంగా వేడి  నీటి గుండం లో  దిగగానే మేము కూడా స్నానం చేసాము. చక్కటి అనుభూతి. 

గంగోత్రి


                                                 గంగోత్రి ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ.
gangotri కోసం చిత్ర ఫలితం


ఇది భాగీరధీ నదీతీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం.  ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్ధామ్లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది. గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక పేరు వచ్చింది. దేవ ప్రయాగనుంచి గంగానదిలో అలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుంచి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుంచి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది. ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారు.
మేము భగీరథీ లో స్నానం చేసి దర్శనం చేసుకొని భట్వాడి తిరిగి వచ్చాము. 
భట్వాడి నుండి 4 వ తేదీ ఉదయమే బయలుదేరి ఉత్తర కాశీ  మీదుగా సాయంత్రం ఫటా  చేరుకున్నాము. ఉత్తర కాశీ  లో  శివాలయం, శక్తి  గుడి చూశాము. ఇక్కడ 6 మీ  ఎత్తైన  పెద్ద త్రిసూలం  చూడవచ్చు.  ఫటా లోని  powanhans  హెలిపాడ్ కు 5 వ తేదీ ఉదయమే చేరుకున్నాము. 11 గంటలకు నలుగురం   హెలికాఫ్టర్ లో కేదార్నాథ్  వెళ్ళాము. రాను పోను కలిసి మనిషికి Rs . 7400.
phata helipad కోసం చిత్ర ఫలితం

కేదార్నాథ్ లో శీఘ్రదర్శనానికి  మనిషికి Rs. 1100. కేదార్నాథ్ హెలిపాడ్ నుండి గుడికి మనిషి వస్తాడు.  గుడి కి వెళ్లిన వెంటనే వాతావరణం మారిపోయింది. వర్షం,  మంచు . విపరీతమైన చలి. హెలికాఫ్టర్ సర్వీస్ కేన్సిల్  చేశారు, 

కేదార్నాథ్


కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఇది భారత దేశాంలోని ఉత్తరా ఖండ్ లోని రుదప్రయ్రాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్నాథ్ సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో ఉంది.మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కోడల మధ్య ఉంది.హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్.
kedarnath కోసం చిత్ర ఫలితం


కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కోడల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతియ నుంచి దీపావళి వరకు భక్త సందర్శనార్ధం గుడిని తెరచి ఉంచుతారు.ఆలయం చేరాటానికి ప్రత్యేకంగా రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుంచి గుర్రాలు, డోలీలు ద్వారా చేరవచ్చు. ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్లు పేర్కొంటారు. ఆలయ వెనుక భాగంలో ఆదిశంకరుడి సమాధి ఉంది. ముఖ్యంగా 12 జ్యోతి లింగాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. ఉత్తరాఖండ్లోని చార్ధామ్లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్లను చార్ ఉత్తరాఖండ్ ధామ్లుగా వ్యవహరిస్తారు.

ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి. పూజకు కావలసిన సామాగ్రి అన్నీ ఆలయ ప్రాంగణంలోనే లభిస్తాయి.చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్లో మాములుగా ఉండే వాతావరణం.. నాలుగు కిలోమీటర్ల తర్వాత చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక గుడిని అక్షయతృతియ నుంచి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.

                                            విపరీతమైన చలితో మేము Rs . 1100 టిక్కెట్ తో  గర్భగుడి లోకి వెళ్ళాము. కేదార్నాథ్ లింగం ఎద్దు మూపురం వలె  పెద్దదిగా ఉంది . చేతితో తాకి అభిషేకం చేసుకోవచ్చు. రష్ బాగా ఉన్నా  queue  లేదు. దర్శనం గంట పట్టింది. గుడి బయట నాగ సాధువులు పూజలు చేస్తున్నారు. గుడి, వెనుక పెద్ద శిలలు , నంది ఫొటోస్ తీసుకొన్నాము. గుడికి అన్ని వైపులా ఎత్తైన కొండలు . మంచుతో వెండికొండల్లా మెరుస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు హెలికాఫ్టర్ లో మిగతా 8 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇంకో గంట సమయంలో అందరం ఏ ఇబ్బంది లేకుండా ఫటా చేరాము.  చాలామంది  టికెట్స్ కాన్సిల్ చేసుకున్నారు. 
                                       మర్నాడు ఉదయమే ఉత్తర కాశి , ఊఖీ మధ్  ల మీదుగా ప్ ప్రయాణించి పిప్పల్కోట్  చేరుకున్నాము. మర్నాడు  ఉదయమే లేచి బదరీనాథ్ కు ప్రయాణం మొదలు పెట్టాము. 
కొండలు , లోయలు  మధ్య ప్రయాణిస్తూ 11 గంటలకు బదరీనాథ్ చేరాము. 


బద్రీనాథ్
బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న పంచాయితీ. చార్ ధామ్(నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది
badrinath కోసం చిత్ర ఫలితం


నర నారాయణ కొండల వరసలమద్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్క్ు సమీపంలో ఉన్న గౌరీ కుండ్కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.బద్రీనాధ్లో ప్రత్యేక ఆకర్షణగా బద్రీనాధ్ ఆలయం. ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక గుడి నిర్మించాడని పురణాల కథనం. 

badrinath tapt kund కోసం చిత్ర ఫలితం
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకేళతాయి.బద్రీ అంటే రేగుపండు నాధ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాధుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ(అలసట)తీర్చడానికి రేగుచెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కనుక ప్రయాణీకులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం ఉత్తమం. కొంతకాలం క్రితం వరకు ఇక్కడకు ప్రయివేట్ వాహనాలు నిషిద్దం కానీ స్వంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు.బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
mana uttarakhand కోసం చిత్ర ఫలితం

మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది. ఇక్కడే సరస్వతి నది. భీం శిల,   వ్యాస గుహ ,  వినాయక  గుహ  వున్నాయి. 
బదరీనాథ్ లో అలకనంద తీరంలో బ్రహ్మకపాలం ఉంది. ఇక్కడ పిండ ప్రదానాలు చేసాము. 

brahma kapal uttarakhand కోసం చిత్ర ఫలితం