Sunday, July 26, 2015

గోకర్ణం   యాత్రా  విశేషాలు 


మేము 12 మంది   కుటుంబ సభ్యులం కలిసి  12 సీట్ల Tempo Traveller  లో   ఉదయం 5 గంటలకు విజయవాడ లో ఇంటినుండి బయలుదేరి  నరసరావుపేట , వినుకొండ , మార్కాపురం  మీదుగా  మధ్యాహ్నం 12 గంటలకు మహానంది చేరాము. 

1. మహానంది :

 నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల నుండి  ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.  నంద్యాల లో  మధాహ్నం భోజనం చేసి అహోబిలం కు బయలుదేరాము. 





2. అహోబిలం :

ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి.  ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. ఎగువ  అహోబిలం లో  దర్శనం  చేసుకుని  8 km  ఘాట్  రోడ్ లో ప్రయాణించి  దిగువ అహోబలం కు చేరుకున్నాము .  దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. అమృతవల్లి సమేత నరసింహుడు సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. చక్కటి శిల్ప సంపద . గర్భ గుడిలో సోదరులు శ్రీ సీతారామయ్య , నాగేశ్వర రావు , సుబ్రహ్మణ్యం లు నారాయణీయం కడు  రమ్యంగా  గానం చేసారు.  దిగువ అహోబలం నుండి  చింతకుంట, ముద్దనూరు, తాడిపత్రి  మీదుగా  రాత్రి 10 గంటలకు  అనంతపూర్ చేరాము. రాత్రి   అనంతపూర్లో  పడుకొని , ఉదయం టిఫిన్ చేసి 6 గంటలకు NH 7 , పెనుగొండ , చికబాల్లపుర , ఎస్వంతపూర్ , నేలమంగళ , కునిగల్ , నెలిగెరె , చేన్నరాయనిపట్న  వెళ్లి  దగ్గరలోని  శ్రావనబెలగోల కు వెళ్ళాము .కాని చాలా మెట్లు ఎక్కవలసినందువలన మరల చేన్నరాయనిపట్న వచ్చాము . అక్కడనుండి  కుక్కి వెళ్ళే ఘాట్ రోడ్  మూసివేయడం వలన హసన్ . సక్లేష్పూర్ , గుండ్య  మీదుగా ప్రయాణించి  రాత్రి 11 గo. కు కుక్కే సుబ్రమణ్య  చేరుకున్నాము 




3. కుక్కే సుబ్రమణ్య : 
             
ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం,దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరు కు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్య. పూర్వం దీనిని కుక్కే పట్నం అనే పిలిచేవారు. క్రమంగా కుక్కె సుబ్రహ్మణ్య గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది పరశురామక్షేత్రాలలో ఒకటి.కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయం  ఈ క్షేత్రం . ఉదయమే  లేచి  వినాయకుని గుడి, దుర్గ అమ్మవారి గుడి చూసాము .  తరువాత  మెయిన్ టెంపుల్ చూసి  ధర్మస్థల  బయలుదేరాము . 

4. ధర్మాస్థల :
ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. ఈ ఆలయంలోశివుడు, మంజునాథుడు, అమ్మనవరు, చంద్రనాథ మరియు కళారాలు అనే ధర్మదైవాలు(ధర్మరక్షణ దైవాలు) , కుమారస్వామి మరియు కన్యాకుమారి మొదలైన దైవాల సన్నిధులు ఉన్నాయి. అసాధారణంగా ఈ ఆలయనిర్వహణ జైన్ మతస్థుల ఆధ్వర్యంలో పూజాదికాలు హిందూ పూజారులచేత నిర్వహించబడుతూ ఉన్నాయి  విపరీతమైన రద్దీ . దర్సనానికి 4 గం  పట్టినది . శృంగేరి  కు  బయలుదేరాము .

5. శృంగేరి :
శంకరాచార్యులవారు   ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో,ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ప్రాకృతికవైరులైన సర్పమండూకముల మధ్య పరస్పర మైత్రీ భావము మరియు సర్పానికి మణ్డూకంపై అత్యంత దయార్థ్ర భావము చూచి భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రాకృతికవైరులలో మైత్రీభావము మూర్తీభవించి ఉన్నది కాబట్టీ ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫురించి  ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి లో, కంచి లో, బదరి లో ,ద్వారక లో మఠాలను స్థాపించారు.
 ఒకప్పుడు "ఋష్యశృంగ గిరి" గా పిలువబడ్డ ప్రాంతమే ఇప్పటి "శృంగేరి". ఇది కర్నాటకలోని చికమగలూర్ జిల్లాలో ఉంది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులచే స్థాపించబడ్డ "పీఠం".   

విద్యారణ్య స్వామి: హరిహర, బుక్కరాయలుచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసారు. ఈయన శ్రుంగేరి పీఠానికి  12వ పీఠాదిపతి. తన గురువుగారయిన "విద్యాశంకరులు" గారి మరణించునట్టి అవశెషాలమీద ఒక గొప్ప దేవాలయాన్ని  1357వ సం.లో కట్టించారు.

విద్యాశంకర దేవాలయం: ఈ దేవాలయ కట్టడంలోని 2 అంశాలు ఇప్పటికీ ప్రపంచంలోని శాస్త్రజ్ఞులకు అంతుచిక్కలేదు.

విద్యాశంకర దేవాలయం
1). ఈ దేవాలయం మొత్తం కూడా రాళ్ళతో ఒక దానిపై ఒకటి చాలా గట్టిగా పేర్చబడినవి. ఈ రాళ్ళను అతికించడానికి కనీసం చిటికెడుకూడా  ఎటువంటి "పదార్థమూ" వాడలేదు.

ముఖద్వారం
2). ముఖద్వారంగుండా లోపలకు వెళ్ళగానే అందరూ కూర్చోవడానికి వీలుగా ఉన్న గదిలో 12 రాశిచక్రములకు గుర్తుగా 12 స్తంభాలు కట్టబడినాయి. సూర్యోదయకిరణాలు ముఖద్వారంగుండా ఏ నెలకు సంభందించిన "రాశి" యొక్క గుర్తుగా లోపల ఉన్న ఆ స్థంభం మీద ఈ కిరణాలు పడేటట్లుగా ఎంతో శాస్త్ర పరంగా, సాంకేతికంగా కట్టారు.  
        
                              ఈ దేవాలయ నలుమూలలా పైవైపుగా నాలుగైదు పెద్ద పెద్ద ఇనుపరింగులతో జేసిన గొలుసువలె,  ఆ పేర్చబడిన రాళ్ళలోనే గాలికి ఉగేటట్లుగా చెక్కారు. అప్పుడొచ్చే శబ్దం గనుక వింటే అచ్చం ఇనుప గొలుసునుండి వచ్చినట్లుగానే ఉంటుంది.    శృంగేరిలో  మఠం  వారి గెస్ట్ హౌస్ లో రూమ్స్ చాల బాగా వున్నాయి .  
  అద్దె కూడా ప్రతి గదికి  రోజుకు  Rs 150 మాత్రమే. మర్నాడు ఉదయమే ఉడుపి కి బయలుదేరాము .                        


6. ఉడుపి :

   
12వ శతాబ్ద కాలంలో ఏర్పాటు చేసిన ఈ మఠాన్ని, ఆలయాన్ని, భవనాలను తుళు సాంప్రదాయ శైలిలో నిర్మించారు. దేవాలయంలోకి ప్రవేశించడానికి ఎలాంటి రుసుము ఉండదు. అయితే ఆలయం ఎడమవైపు భాగంలో ప్రధాన ఆకర్షణగా కనిపించే కోనేరు ప్రహరీ చుట్టూ క్యూలో నడుస్తూ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మగవారు పిల్లలయినా, పెద్దలైనా విధిగా చొక్కా, బనీను తీసి మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఉడిపి ఆలయంలోని శ్రీకృష్ణ విగ్రహం ఓ ముద్దులొలికే చిన్ని బాలుని రూపంలో ఉంటుంది. నలుపురంగు, సాలిగ్రామ శిలతో తయారు చేసిన ఈ విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. స్వామివారి మూలవిరాట్‌ విగ్రహం ఉంచిన గర్భగుడి ఒక గదిలా ఉండి ముందువైపు కిటికీలలాంటి తలుపులు ఉంటాయి. ఎప్పుడూ మూసి ఉండే ఈ తలుపులకు ఏర్పాటు చేసిన తొమ్మిది అంగుళాల పొడుగు, వెడల్పులో చేసిన నలు చదరపు కంతల ద్వారా శ్రీకృష్ణ దర్శనమవుతుంది. ఒక్కో తలుపులో ఏర్పాటు చేసిన తొమ్మిది కంతల ద్వారా మాత్రమే ఉడిపి శ్రీకృష్ణను దర్శించుకోవాల్సి ఉంటుంది. దేశంలోని మిగిలిన దేవాలయాలకు భిన్నంగా ఈ దర్శనముంటుంది. ప్రతి మనిషిలో ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా ఈ నవద్వారాలు ఏర్పాటు చేశారు. కేవలం రెండున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండే ఈ చిన్నికృష్ణుడి విగ్రహం కుడి చేతిలో ఒక తాడు, ఎడమ చేతిలో మజ్జిగ కవ్వమూ ఉంటాయి. పూజారులు, అర్చకుల ప్రమేయం లేకుండా దర్శనం ఉడిపి దేవాలయ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. దేశంలోని ఇతర ఆలయాలలో దైవదర్శనానికి పూర్తి భిన్నంగా ఈ ఆలయ దర్శనం ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ భోజనాలు పెడతారు .  భోజనం చేసి కొల్లూర్ బయలుదేరాము . 


7. కొల్లూర్  మూకంబిక :



శ్రీ ఆది శంకరాచార్యులకు దేవి సాక్షాత్కరించగా వెను వెంటనే అతి శ్రావ్యమైన ‘సౌందర్యలహరి శ్లోకాలను రచించిన ప్రదేశం ఇక్కడే .కర్నాటక లోని ఏడు ముక్తి క్షేత్రాలైన  పరశురామ క్షేత్రాలలో కొల్లూరు ఒకటి మిగిలినవి ఉడిపి , సుబ్రహ్మణ్య , కోడేశ్వర , శంకర నారాయణ , గొకర్ణ క్షేత్రాలు. ఈ ముక్తిస్థాలాలలో కొల్లూరు ఒక్కటే పార్వతీ దేవి క్షేత్రం గా నెలకొన్నది. ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగం గా శివుని తో కలిసి ఉండటం . శ్రీ ఆది శంకరా చార్యుల వారు ఆలయం లో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించటం జ్యోతిర్లింగం వెనకగామూకాంబిక అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఇప్పటికీ శంకరాచార్యుల వారు సూచించిన విధంగానే ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తుంటారు. మూకాంబిక ఉదయం వేళలో 'దుర్గగా ... మధ్యాహ్నం వేళలో 'లక్ష్మిగా ... సాయంత్రం వేళలో 'సరస్వతి'గా భక్తులను అనుగ్రహిస్తుంటుంది. గుడి లోనే భోజనం చేసి రాత్రి దేవస్థానం గదులలో  పడుకొని ఉదయమే మురుడేస్వర్  బయలుదేరాము .

8. మురుడేస్వర్ :
భగవంతుడైన శివుని భక్తులు 123 అడుగుల ఎత్తుగల శివుడి విగ్రహం శివలింగంతో సహా ఈ దేవాలయంలో చూస్తారు. ఇంత పెద్దదైన విగ్రహాన్ని మురుడేశ్వర్ వెళ్ళేవారు తప్పక చూడాల్సిందే. దేవాలయ పరిసరాలలో చెక్కబడిన అనేక లిపులను కూడా పర్యాటకులు పరిశీలించవచ్చు. దీని రాజగోపురం 20 అంతస్తులతో ఉండి ప్రవేశం వద్ద రెండు పెద్ద ఏనుగులుంటాయి. దేవాలయాన్ని దక్షిణ భారత శిల్ప శైలిలో గ్రానైట్ రాయితో నిర్మించారు.
మురుడేశ్వర ఫొటోలు, శివ విగ్రహం
 మురుడెశ్వర్ సందర్శించేవారు అతిపెద్ద శివుని విగ్రహం తప్పక చూడాల్సిందే. ఈ విగ్రహం 123 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు రెండు సంవత్సరాలకాలం పట్టింది.  రాజగోపురం  లిఫ్ట్ లో ఎక్కి  ఫొటోలు తీసుకొని   గోకర్ణ కు  బయలుదేరాము . 



9. గోకర్ణ :
గోకర్ణం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది ఒక యాత్రా స్ధలం మరియు అందమైన బీచ్ లు ఉండటంచే పర్యాటక స్ధలం అని కూడా చెప్పవచ్చు. ఇది రెండు నదుల అంటే అగ్నాషిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో ఉంది. నదులు రెండూ కలిసి ఒక గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని గోకర్ణం అంటే ఆవు చెవి గా వర్ణిస్తారు. గోకర్ణంలోని మహాబలేశ్వర శివ దేవాలయం హిందువులకు ప్రత్యేకించి శైవులకు ఎంతో పవిత్రమైంది. తమిళ కవులు అప్పార్ మరియు సంబంధార్ లు దీని గురించి తమ కవిత్వంలో ఎంతో వర్ణించారు. భగవానుడు తుళు నాయుడిని తమ పద్యాలలో కీర్తించారు.


 గోకర్ణం లోని మహాబలేశ్వర దేవాలయ శివలింగం ఇక్కడకు రావణుడు తెచ్చినదిగా చెప్పబడుతుంది. రావణుడు శివుడి నుండి ఆత్మ లింగాన్ని పొందుతాడు. దీని ద్వారా రావణుడికి ప్రత్యేక మహిమలు వచ్చేస్తాయని, అతడు తమను మరింత పీడిస్తాడని భావించిన దేవతలు గణేశుడి సహాయంతో ఉపాయంగా ఆత్మ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.  ఇక్కడ మహాబలేశ్వర దేవాలయమే కాక, ఇతర దేవాలయాలు, అంటే మహా గణపతి, భద్రకాళి, వరదరాజ, వెంకట రమణ దేవాలయాలు కూడా ఉన్నాయి.  

గోకర్నలో   భోజనం  చేసి  ఓం బీచ్  , ఆత్మ లింగ స్పర్శ దర్శనం చేసుకొని  పంజిమ్ బయలుదేరాము.  
10. గోవా :






11. హంపి :



12. శ్రీశైలం:


 అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.  భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.

13. త్రిపురాంతకం:

 త్రిపురాంతకం బాలా త్రిపూరాసుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంటకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడినాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది. స్వామి వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం, మేరు చక్రం మధ్యగలజలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూచక్రపిఠము గుండా క్రిందకు జారి పాతళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.

14. కోటప్పకొండ :


చతుర్దశ భువనాలు శివమయ సంధానాలు, మంగళకరమగు శివ శబ్దము సకల చరాచర జీవకోటికి ఆధారము. పరమేశ్వరుడు ఆది అంతాలు లేని సర్వవ్యాపనమైన చైతన్య శక్తి. అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం. అందుకే శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం. ఆ లింగమే త్రికోటేశ్వరుడు. ఆయనే కోటప్ప. అంతటి మహొత్కృష్టమైన క్షేత్రమే త్రికూటాచలం. అదియే కోటప్పకొండ. పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో కోటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం.
శాసనాల అధారంగా ఈ ఆలయం 1172 ఎ.డి లో నిర్మించబడింది. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉన్నది.

15. మంగళగిరి:




మంగళగిరిలో చీరలు కొన్నారు. యాత్ర పూర్తి చేసుకుని విజయవాడ చేరాము 

 








No comments:

Post a Comment